Cherial: పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సవాల్
Cherial: చేర్యాలలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం. 1000 రోజుల సంక్షేమ పాలనపై అసత్య ప్రచారాలు చేస్తున్న బిఆర్‌ఎస్‌పై మండిపాటు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్.
Cherial: పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సవాల్
చేర్యాల: జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చేర్యాల క్యాంపు కార్యాలయంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట మండలాల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వెయ్యి రోజుల ప్రజాపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక గులాబీ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
గులాబీ పార్టీ నాయకులారా.. ఖబడ్దార్! ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధపు ప్రచారాలతో వాస్తవాలను కప్పిపుచ్చలేరని హెచ్చరించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై విమర్శలు చేయడం మీ అసహనానికి నిదర్శనమన్నారు.
మీ పదేళ్ల పాలనకు.. మా మూడు సంవత్సరాల పాలనను పక్కపక్కన పెట్టి ప్రజల ముందే లెక్కలు తేల్చుకుందాం. అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం.. మీరు సిద్ధమా? అని గులాబీ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన అనేక రంగాలకు కొత్త ఊపునిస్తున్నామని పేర్కొన్నారు.
అసత్య ప్రచారాలు, సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ ఆరోపణలతో ప్రజల కళ్లను కప్పలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో.. ఎవరి పాలనలో ప్రజలకు మేలు జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. గులాబీ పార్టీ నాయకులకు అభివృద్ధిపై నిజంగా నమ్మకం ఉంటే ప్రజల ముందుకు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
“పదేళ్లు మీరు పాలించారు.. మూడు సంవత్సరాలు మేము పాలిస్తున్నాం. అభివృద్ధిపై లెక్కలు తేల్చుకుందాం. మీ పాలనలో ఏం చేశారు.. మా పాలనలో ఏం జరుగుతుందో ప్రజల ముందే చర్చిద్దాం. మేము సిద్ధం.. మీరు సిద్ధమా?” అని ఘాటుగా ప్రశ్నించారు.
ఇకనైనా గులాబీ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకుని ప్రజల సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని సూచించారు. లేనిపక్షంలో ప్రతి అబద్ధానికి వాస్తవాలతో సమాధానం చెబుతూ ప్రజల ముందు గులాబీ పార్టీ నేతల అసలు రంగును ఎండగడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో చేర్యాల మండల పట్టణ అధ్యక్షులు మంజె మల్లేశం
దాసరి శ్రీకాంత్ మద్దూరు మండల అధ్యక్షుడు మారేళ్ల భాస్కర్ రెడ్డి ధూల్మిట్ట మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్ సిద్దిపేట జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు పూర్మ ఆగంరెడ్డి స్పోక్స్ పర్సన్ కాటం సంజీవయ్య ఆత్మ కమిటీ చైర్మన్ ,కౌన్సిలర్లు పోతుగంటి ప్రసాద్ వెలుగల దుర్గయ్య ఎండీ ఖాజా సర్పంచులు కొమ్మురవి లింగంపల్లి చంద్రశేఖర్ కొలుపుల యాదగిరి ఫాల్తీయ రమేష్ బాధవత్ శ్రీనివాస్ పర్వతం చెంద్రయ్య జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ తాటికొండ సదానందం, p




