Cherial: గణపతి మండపాల వద్ద నిబంధనలు పాటించాలి చేర్యాల సీఐ రమేష్ నాయక్!

Cherial: చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి మండలాల్లో గణేష్ నవరాత్రులకు పోలీస్ నిబంధనలు జారీ. డీజేలకు అనుమతి లేదు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఐ రమేష్ నాయక్ సూచన.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 12 Sept 2026 3:28 PM IST
Cherial
X

Cherial: గణపతి మండపాల వద్ద నిబంధనలు పాటించాలి చేర్యాల సీఐ రమేష్ నాయక్!

Cherial: చేర్యాల మద్దూర్ కొమురవెల్లి మండలాల్లో గల గ్రామాలలో 14 తేదీ నుండి గణేష్ నవరాత్రుల సందర్భంగా మీడియా తో CI రమేష్ నాయక్ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖ వారు సూచించిన మేరకు నిభందనలు పాటించి శాంతియుత వాతావరణం లో ఉత్సవాలు నిర్వహించుకోవాలని చేర్యాల CI రమేష్ నాయక్ గారు తెలిపారు.

వినాయక విగ్రహాలు మరీ పెద్దవి కాకుండా 5-6 ఫీట్స్ ఉండే విగ్రహాలు అయితే నిమజ్జనం చేయడానికి సులువుగా ఉంటుందని అదే విధంగా మండపాల వద్ద డీజేలు మరీ ఎక్కువ శబ్దం వచ్చే విధంగా మైక్ లు పెట్టారాదనీ గణేష్ మండపాల వద్దకు దర్శనానికి వచ్చే భక్తుల పట్ల కమిటీ వారు మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని మద్యం తాగిన అస్లీల పాటలను వేసిన వారిపై పోలీస్ లు చర్యలు తీసుకుంటారని తెలిపారు.

మండపాల వద్ద షాట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది కనుక ఒక డ్రమ్ లో నీరు నింపి ఉంచుకోవాలని అలాగే వీలైతే ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలని సూచించారు అందరు కలిసి నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలని ఎలాంటి ఘర్షణలకు తావివ్వొద్దని కోరారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL