Cherial: ఆటో కార్మికుల సమస్యలపై పోరాడుతున్న పాల సాయిలు సన్మానం

Cherial: చేర్యాల మండల ఏఐటీయూసీ కార్యాలయంలో ఆకునూరు గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షుడు పాల సాయిలును నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 28 Aug 2026 9:11 PM IST
Cherial
X

Cherial: ఆటో కార్మికుల సమస్యలపై పోరాడుతున్న పాల సాయిలు సన్మానం

చేర్యాల: ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొంతకాలంగా కార్మికుల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న ఆకునూరు గ్రామ భారత్ ఆటో యూనియన్ అధ్యక్షులు పాల సాయిలును చేర్యాల మండలంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సంఘం నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అందే అశోక్ మాట్లాడుతూ.. ఆకునూరు గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్న పాల సాయిలును చేర్యాల మండల ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడాలని సూచించారు.

ఈ సందర్భంగా పాలసాయిలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో కార్మికుడికి నెలకు రూ.12 వేలు జీవన భృతి చెల్లించాలని, ప్రమాదవశాత్తు మరణించిన ఆటో కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలను రద్దు చేయాలని, ప్రతి పట్టణం, మండలం, గ్రామంలో ఆటో కార్మికులకు హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలని, ప్రతి ఆటో కార్మికుడికి పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ విషయంపై ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ తరపున జేఏసీకి పెద్దన్న పాత్ర పోషించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపారు. క్యాబినెట్ లో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సెప్టెంబర్ 1న అధికారిక ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఆగస్టు 24న తలపెట్టిన ఆటో బంద్ ను విరమించుకున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు.

భవిష్యత్తులో ఆటో కార్మికులకు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు కర్రె ఆంజనేయులు, ఈరి భూమయ్య, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, పోషబోయిన పరమశేఖర్, బియ్య బాలరాజు, మనెపల్లి కిష్టయ్య, సిద్దిరాం భద్రయ్య, నంగి సత్తయ్య, ఎగుర్ల ఎల్లయ్య, చేర్యాల యాదయ్య పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story