Thoguta: చందాపూర్ ప్రథమ సర్పంచ్ నరిశెట్టి లింగం అనారోగ్యంతో కన్నుమూత
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ తొలి సర్పంచ్ నరిశెట్టి లింగం అనారోగ్యంతో మృతి చెందారు.
Thoguta: చందాపూర్ ప్రథమ సర్పంచ్ నరిశెట్టి లింగం అనారోగ్యంతో కన్నుమూత
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం చందాపూర్ గ్రామపంచాయతీ ప్రధమ సర్పంచ్ ( ఏకాగ్రివం ) నర్శెట్టి లింగం గారు ఈరోజు ఉదయం మరణించారు. చందాపూర్ సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామంలోని జన్మభూమి కార్యక్రమంలో చందాపూర్ లో అనేక కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు చందాపూర్ లోని వాటర్ ట్యాంక్ నూతనంగా పాఠశాల భవనం మరియు ప్రహరీ గోడ వీధులలో మట్టి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు అని గ్రామస్తులు అన్నారు.
ఆయన చిన్నతనం నుండే చాలా కష్టపడే తత్వమని తుక్కాపూర్ బ్రాహ్మని బంజేరుపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాలలో బీడీల కంపెనీలు పెట్టి అనేక బీడీ కార్మికులకు ఉపాధి కల్పించారని బీడీ కార్మికులు అన్నారు. ఆయన భౌతిక కాయాన్ని గ్రామస్తులు సందర్శించి నివాళులు అర్పించారు.
Next Story




