Medak: గూడూరు శ్రీ గురు పీఠంలో దుండగుల వీరంగం!
Medak: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు శ్రీ గురు పీఠం ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.
Medak: గూడూరు శ్రీ గురు పీఠంలో దుండగుల వీరంగం!
Medak: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురు పీఠంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు చోరీ చేసినట్లు గుర్తించారు.
శుక్రవారం ఉదయం ఆలయ నిర్వాహకులు ఆలయానికి చేరుకోగా తాళాలు పగులగొట్టబడిన విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.




