Siddipet: రైతన్నకు కొత్త ఆశ.. ఆరుద్ర పురుగుల రాకతో పరవశం!

Siddipet: ఆరుద్ర పురుగులు కనిపించాయంటే వర్షాలు రాబోతున్నట్టే! రైతన్నల నమ్మకం, ప్రకృతితో వారి అనుబంధంపై ప్రత్యేక కథనం.

Chindam Karunakar, Dubbak
Published on: 15 Jun 2026 10:19 AM IST
Siddipet
X

Siddipet: రైతన్నకు కొత్త ఆశ.. ఆరుద్ర పురుగుల రాకతో పరవశం!

Siddipet: ఎర్రటి ఆరుద్ర పురుగుల దర్శనంతో రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజే స్తోంది. ఆకాశంలో మేఘాలు కదలాడితే రైతన్న కళ్లు వెలు గుతాయి, గాలిలో తేమ పెరిగితే మనసు పరవశిస్తుంది. ఆ సమయంలోనే పొలాల గట్ల వెంబడి, దున్నని మట్టిలో కనిపించే చిన్న ఎర్రటి జీవులు ప్రకృతి పలికే భాషలా అని పిస్తాయి.

వాతావరణ యాప్లు, ఉపగ్రహ చిత్రాలు అందుబాటులోకి వచ్చినా, పల్లెల్లో నేటికీ ప్రకృతి, నక్షత్రా లు, కార్తెలను బట్టే వ్యవసాయ క్యాలెండర్ను నిర్ణయించు కుంటారు.

నైరుతి రుతుపవనాల ఆగమనానికి, సాగు సీజ న్ ప్రారంభానికి ఆరుద్ర కార్తె ఒక ప్రత్యేక సంకేతం.వర్షాగమనానికి సూచనగా..ఎండాకాలమంతా భూమి లోతుల్లో దాగి ఉండే ఈ ఇంద్రగోపాలు, తొలి వర్షాలకు నేల తడిసి తేమ పెరగగానే బయటకు వస్తాయి.

వీటిని శాస్త్రవేత్తలు కేవలం ఒక జీవ జాతిగా చూసినా, రైతులు మాత్రం వీటి రాకను వర్షాగమ నానికి ముందస్తు సూచనగా భావిస్తారు. ఆరుద్ర పురు గులు కనిపిస్తేనే భారీ వర్షాలు కురుస్తాయని శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా, భూమి జీవవ్యవస్థ వానాకాల చక్రంలోకి ప్రవేశించిందనడానికి ఇవి సజీవ సాక్షలు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story