Akbarpet Bhumpally: మండల ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరింది.. సీఎం రేవంత్ రెడ్డికి పాతూరి వెంకటస్వామి గౌడ్ కృతజ్ఞతలు!
Akbarpet Bhumpally: సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రానికి నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
Akbarpet Bhumpally: మండల ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరింది.. సీఎం రేవంత్ రెడ్డికి పాతూరి వెంకటస్వామి గౌడ్ కృతజ్ఞతలు!
అక్బర్పేట భూంపల్లి/దుబ్బాక: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ మండల ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరే దిశగా నేడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అక్బర్పేట భూంపల్లి మండల నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేయడంతో మండల ప్రజల్లో ఆనందం నెలకొందని ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
రేవంతన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మండలానికి శాశ్వత తహసీల్దార్ కార్యాలయ భవనం అవసరమనే ప్రజల చిరకాల డిమాండ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం అభినందనీయమని అన్నారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ కార్యాలయం ద్వారా రెవెన్యూ సేవలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.




