Siddipet: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ బర్త్‌డే.. కేక్ కట్ చేసిన న్యాయవాదులు!

Siddipet: సిద్దిపేట కోర్టు ఎదుట ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

RAJU, SIDDIPET
Published on: 2 Sept 2026 4:53 PM IST
Siddipet
X

Siddipet: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ బర్త్‌డే.. కేక్ కట్ చేసిన న్యాయవాదులు!

సిద్దిపేట జిల్లా: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు దోనె అశోక్ న్యాయవాది, ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్ట్ ముందు అభిమానులు మరియు జానసేన నాయకుల సమక్షంలో కేకు కటింగ్ చేయడం జరిగింది. అనంతరం శ్రీ దోనె అశోక్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

అలాగే వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ఉండి సేవ చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో న్యాయవాదులు మల్యాల శేషు కుమార్, చెవుల రాములు, వెంకటేశ్వర్లు, చిరంజీవి మహిళా న్యాయవాదులు, జనసైనికులు విక్రమ్, మహేష్, కిరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story