Siddipet: ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్: రాష్ట్ర కార్యదర్శి రాంబాబు తీవ్ర ఆగ్రహం!

Siddipet: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ఏబీవీపీ విద్యార్థుల అరెస్టును రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తీవ్రంగా ఖండించారు.

RAJU, SIDDIPET
Published on: 2 Sept 2026 6:26 PM IST
Siddipet
X

Siddipet: ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్: రాష్ట్ర కార్యదర్శి రాంబాబు తీవ్ర ఆగ్రహం!

సిద్దిపేట: స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకొని విద్యార్థులను అరెస్టు చేయడాన్ని, ABVP రాష్ట్ర కార్యదర్శి, మాచర్ల రాంబాబు తీవ్రంగా ఖండించారు.

ఈ ర్యాలీకి విచ్చేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ "విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే, వారి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అడ్డుకోవడం బాధాకరమన్నారు

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుపై ఈ బకాయిల ప్రభావం పడుతోందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సింది పోయి, మా నిరసనను అణచివేయడం సరికాదన్నారు.

శాంతియుతంగా తమ హక్కుల కోసం గళమెత్తే విద్యార్థులను అరెస్టు చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. అరెస్టులతో విద్యార్థుల గొంతును అణచివేయలేరన్నారు. వారి సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే అన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి:

పెండింగ్‌లో ఉన్న 11000 వేలకోట్ల స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి. విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి. విద్యార్థులపై పోలీసు నిర్బంధం కాదు వారి సమస్యలకు పరిష్కారమే ప్రభుత్వ బాధ్యత.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, నగర కార్యదర్శి తరుణ్, శ్రీకాంత్, మృదులయ్య, అఖిల, పవన్, సాత్విక్, నితిన్ విద్యార్థులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story