Siddipet: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: ఏబీవీపీ
Siddipet: సిద్దిపేటలో ఏబీవీపీ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
Siddipet
Siddipet: విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలు రాజు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రూ.10 వేల కోట్ల బకాయిలను విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఫీజులు లేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడం బాధాకరమని అన్నారు.
ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు ఆదిత్య, పరుశురాం, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.




