Korukonda: ఘనంగా వైఎస్సార్ జయంతి.. రక్తదానం చేసిన మాజీ ఎమ్మెల్యే!
Korukonda: YSRCP Youth Leader Jakkampudi Raja Participates in Mega Blood Donation Camp
Korukonda: ఘనంగా వైఎస్సార్ జయంతి.. రక్తదానం చేసిన మాజీ ఎమ్మెల్యే!
కోరుకొండ: బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూ డి రాజా ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి వేడు కలు ఘనంగా నిర్వహిం చారు .
కోరుకొండలో వైయ స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మెగా వైద్య శిబి రాన్ని రాజా ప్రారంభిం చారు.
సుమారు వందమందికి పైగా యువకులు రక్తదానం చేశారు. జయంతి సంద ర్భంగా కేక్ కట్ చేశారు. డాక్టర్ వైయస్సార్ జక్కం పూడి రామ్మోహన్ రావు బ్లడ్ బ్యాంక్ ప్రతినిధుల పర్యవేక్షణలో రక్తదానం కొనసాగింది. రాజా యువ కులతో కలిసి రక్తదానం చేశారు.
అనంతరం నిర్వహిం చిన మీడియా సమావేశం లో రాజా మాట్లాడుతూ ఐదేళ్ల రాజశేఖర్ రెడ్డి పాల న దేశంలో 500 సంవత్స రాలు ప్రతి పేదవాడికి గుర్తుండే విధంగా సువర్ణ పాలన అందించారన్నారు.
తండ్రి పేదల కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడు గులు వేశారన్నారు. వైయస్సార్ ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు.
వైయస్సార్ లేకుంటే ఆరోగ్యశ్రీ వంటి పథకం వచ్చి ఉండేదా అన్నారు. వైయస్సార్ సీఎం సీఎం కాకుంటే ఫీజు రియంబ ర్స్మెంట్ పథకం అమలు చేసేవారా అని గుర్తు చేశారు. చిన్న సంతకంతో రైతులకు ఉచిత విద్యుత్ అందించి దేశంలోనే సీఎం లకు ఆదర్శంగా నిలిచిన మహ నీయుడు వైయ స్సార్ అని కొనియాడారు.
వైయస్సార్ బతికి ఉంటే రాష్ట్రాన్ని అడ్డగోలు గా విభజన చేసి ఉండేవా రని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించా యన్నారు.
నాడు వైయస్సార్ చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించా రన్నారు.
నేడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపో యిందని అన్నారు. రాయ లసీమ వంటి ప్రాంతంలో తాత ముత్తాతల నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలను అరికట్టిన మహనీయుడు వైయస్సార్ అని కొనియా డారు.
రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో కూటమి ప్రభు త్వం రూ 3.50 లక్షల కోట్లు అప్పులు చేసిందని, కంటికి కనిపించే అభివృద్ధి చేస్తు న్నారా అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో లో రూ2..72 లక్షల కోట్లు డిబిటి పద్ధతి లో అర్హత ను ప్రామాణికం గా తీసుకుని ప్రతి సంక్షేమ పథకం పేదవాడి ఖాతాలో నే నేరుగా పథకాల సొమ్ము జమ చేశారన్నారు.
వైయస్సార్ వంటి మహనీయుని దూరం చేసుకోవడంతో రాష్ట్రం అన్ని విధాల వెనక్కి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.
పలురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




