Razole: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి.. వైఎస్సార్‌సీపీ నేత!

Razole: రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి పిలుపు.

PRABHU, RAZOLE
Published on: 9 Sept 2026 4:33 PM IST
Razole
X

Razole: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి.. వైఎస్సార్‌సీపీ నేత!

Razole: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సూచనలతో సఖినేటిపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన ఉయ్యూరివారిమెరక గ్రామంలోని శ్రీ అల్లూరి కృష్ణంరాజు మెమోరియల్ ఫంక్షన్ హాల్‌లో రాజోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా పాముల రాజేశ్వరి దేవి హాజరయ్యారు. తొలుత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాజేశ్వరి దేవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ సమావేశంలో సీఈసీ సభ్యుడు కేఎస్ఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శులు పాటి శివకుమార్, కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాముల ప్రకాష్, మండల పార్టీ అధ్యక్షులు అడబాల బ్రహ్మాజీ, కట్టా శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు మట్టా శైలజ, కోటిపల్లి ఎస్తేరు రాణి, గెడ్డం తులసి భాస్కరరావు, తెన్నేటి కిషోర్, తాడి సహదేవ్, నేతల నాని, జానబాబ్జి, చింత ప్రసాద్, నల్లి సుధీర్, రంగరాజు, ఈదా రవిరెడ్డి, దొంగ ఏసుబాబు, తోటే జాన్‌బాబు, జాలేం జనార్దన్, మద్దుల కాసుబాబు, మోకా సురేష్, తులా సత్యనారాయణ, గుర్రం జాషువా, గుబ్బల సత్యనారాయణ, ఇనుమర్తి శ్రీకాంత్, కారుపర్తి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

అలాగే రాజోలు నియోజకవర్గం, మండల అనుబంధ విభాగాల ప్రతినిధులు, గ్రామ శాఖల నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story