Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికలపై రేపు వైఎస్సార్‌సీపీ సన్నాహక సమావేశం!

Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం సెప్టెంబర్ 7న భట్నవిల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో నిర్వహణ.

SURESH, AMALAPURAM
Published on: 6 Sept 2026 2:11 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికలపై రేపు వైఎస్సార్‌సీపీ సన్నాహక సమావేశం!

Amalapuram: రేపు మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశం ఏర్పాటుచేసిన వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ , తేదీ:07-09-2026 సమయం సోమవారం ఉదయం 9:00 గంటలకు వేదిక భట్నవిల్లి క్యాంప్ కార్యాలయం అమలాపురం మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించబడుతుంది.

రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో,అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది అన్ని వైస్సార్సీపీ నాయకులు తెలియజేశారు.

ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళిక,వార్డుల వారీగా ఎన్నికల సన్నాహకాలు తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది అని తెలిపారు.కావున అమలాపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు వివిధ వార్డుల్లో పోటీ చేయడానికి ఆసక్తి కలిగిన ఆశావహులు అందరూ తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన వైస్సార్సీపీ పార్టీ నేతలు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story