Amalapuram: గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొ రావడం ఆనందదాయకం!

Amalapuram: ఓడలరేవులో సముద్రంలో గల్లంతై సురక్షితంగా తిరిగొచ్చిన మత్స్యకారులను ఘనంగా సత్కరించిన వైఎస్‌ఆర్‌సీపీ నేత పినిపే శ్రీకాంత్.

SURESH, AMALAPURAM
Published on: 4 Sept 2026 4:06 PM IST
Amalapuram
X

Amalapuram: గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొ రావడం ఆనందదాయకం!

Amalapuram: అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన మత్స్యకారులుసముద్రంలో గల్లంతై,అనంతరం సురక్షితంగా తిరిగి రావడం ఎంతో ఆనందదాయకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అన్నారు.ఈ సందర్భంగా సురక్షితంగా తిరిగి వచ్చిన మత్స్యకారులను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ మత్స్యకారులు గల్లంతైన సమయంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారని,ఆ క్లిష్ట సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబాలకు అండగా నిలిచి, వారికి ధైర్యం కల్పించి నిత్యావసర సరుకులను అందజేశామని గుర్తుచేశారు.

మత్స్యకారులు వారి జీవనోపాధికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ అన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీను బోటు తీసుకురావడం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి వచ్చేలాగా చూస్తాము అని హామీ ఇచ్చారు.ఇప్పటివరకు ఇవ్వకుండా హామీని గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఓడలరేవు కు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతై,అనంతరం సురక్షితంగా తిరిగి రావడం ఎంతో ఆనందదాయకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. మత్స్యకారులు గల్లంతైన సమయంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారని,ఆ క్లిష్ట సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబాలకు అండగా నిలిచి, వారికి ధైర్యం కల్పించి నిత్యావసర సరుకులను అందజేశామని గుర్తుచేశారు.

మత్స్యకారులు వారి జీవనోపాధికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ అన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీను బోటు తీసుకురావడం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఇవ్వకుండా హామీని గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాపూజీ,గ్రామ కమిటీ అధ్యక్షులు శేషగిరిరావు,ఉమా మహేశ్వరరావు రాష్ట్ర ఆర్.టి.ఐ జోన్2 అధ్యక్షులు వర్మ ,వెంకన్న, వైస్సార్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story