P Gannavaram: పి.గన్నవరం లంక గ్రామాల సమస్యలను సీఎం పట్టించుకోలేదు!
P Gannavaram: అంబాజీపేట మీ భూమి–మీ హక్కు సభలో జగన్‌పై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను పి.గన్నవరం వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ ఖండించారు.
P Gannavaram: పి.గన్నవరం లంక గ్రామాల సమస్యలను సీఎం పట్టించుకోలేదు!
P Gannavaram: అంబాజీపేటలో మీ భూమి మీ హక్కు గ్రామసభలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై సీఎం చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని పి గన్నవరం వైసిపి కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు.
పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పట్టించు కోకుండా తన రాజకీయ లబ్ధి కోసం వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి పై బురద జల్లుతున్నారని అన్నారు వరదలకు చాలా లంక గ్రామాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయని వాటి కోసం కనీసం మాట్లాడలేదని, ఉడుముడి బ్రిడ్జ్ అంచనా వ్యాయాన్ని పెంచుకుని జేబులు నింపుకుంటున్నారని, సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కారని అంతేకాకుండా భోగాపురం ఎయిర్ పోర్ట్, చాలా ప్రాజెక్టులు ఇలా ఎన్నో వైసిపి హయాంలో జరిగిన సంక్షేమాలను సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసి తన ఖాతాలో వేసుకున్నాడని పి గన్నవరం వైసిపి కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులను గాలికొదిలి వెన్ను పోటు రాజకీయాలు, నీచ రాజకీయాలు చేస్తున్నారని పి గన్నవరం వైసిపి కోఆర్డినేటర్ అన్నారు.




