Razole: కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ కమిటీలో రాజోలు నేతలకు పదవులు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ నూతన కార్యవర్గంలో రాజోలు నాయకులకు కీలక పదవులు. వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన నేతలు.
Razole: కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ కమిటీలో రాజోలు నేతలకు పదవులు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గంలో రాజోలు ప్రాంతానికి చెందిన పలువురికి కీలక పదవులు లభించాయి. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం జిల్లా అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాల జాబితాను విడుదల చేసింది.
పార్టీ అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసే లక్ష్యంతో వివిధ విభాగాల్లో ముఖ్య నాయకులను నియమించారు. ఇందులో భాగంగా జిల్లా మహిళా విభాగం, జిల్లా మైనారిటీ విభాగం, జిల్లా పబ్లిసిటీ విభాగం, జిల్లా ఆర్టీఏ విభాగం తదితర విభాగాలకు నూతన బాధ్యతలు అప్పగించారు.
రాజోలు ప్రాంతానికి చెందిన శ్రీమతి రేవు జ్యోతి ను జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, మహమ్మద్ అబ్దుల్ అమిత్‌ను జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా, చింతా కుమార్ రాజును జిల్లా పబ్లిసిటీ విభాగంలో, బెల్లంకొండ ఏసుబాబును జిల్లా ఆర్టీఏ విభాగంలో నియమించారు.
తమపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి, పార్టీ అధిష్ఠానానికి నూతనంగా నియమితులైన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటామని వారు పేర్కొన్నారు.
రాజోలు ప్రాంతానికి చెందిన పలువురికి జిల్లా స్థాయిలో పదవులు దక్కడంతో స్థానిక వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నూతనంగా నియమితులైన నాయకులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.




