Ramachandrapuram: భర్తను సందికల్లు పొత్రంతో కొట్టి చంపిన భార్య!

Ramachandrapuram: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో భార్యపై అనుమానంతో గొడవపడిన భర్త ఎల్లారావును భార్య ఉమాదేవి సందికల్లు పొత్రంతో కొట్టి హత్య చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Aug 2026 12:05 PM IST
Ramachandrapuram
X

Ramachandrapuram: భర్తను సందికల్లు పొత్రంతో కొట్టి చంపిన భార్య!

Ramachandrapuram: భార్య తంగేటి ఉమాదేవి చేతిలో హత్య కు గురైన భర్త తంగేటి ఎల్లారావు (46).భార్యపై అనుమానం, భార్య భర్తల మధ్య కొంతకాలం గా జరుగుతున్న గొడవలు ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

నిందితురాలు ఉమాదేవిపై మర్డర్ కేసు నమోదు చేసి విచారిస్తున్న రామచంద్రపురం పోలీసులు.రామచంద్రపురానికి చెందిన తంగేటి ఎల్లారావు తన మొదటి భార్య 15 ఏళ్ల క్రితం చనిపోవడంతో ఉమాదేవిని రెండవ వివాహం చేసుకుని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.

వృత్తి రీత్యా వంట పనులు చేసుకుని జీవించే ఎల్లారావు కు భార్య ఉమాదేవి పై అనుమానం పడుతూ గొడవలు పడేవాడు.ఇందులో భాగంగా ఈనెల 25న మద్యం సేవించి వచ్చి భార్య ఉమాదేవి తో ఘర్షణకు దిగిన ఎల్లారావు.

దీంతో భార్య ఉమాదేవి సందికాలు పొత్రంతో భర్త ఎల్లారావు పై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు చెపుతున్నారు.హతుడు సోదరుడు తంగేటి సూరిబాబు ఇచ్చిన పిర్యాదు మేరకు భార్య ఉమాదేవి పై 103(1) బి ఎన్ ఎస్ కింద రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్లారావు హత్య కేసులో ఉమాదేవి తో మరెవరి ప్రమేయం ఉందా? అనే కోణం లో పోలీసులు విచారణ చేస్తున్నారు.మృతదేహాన్ని ఎల్లారావు తల్లి తన ఇంటి వద్ద కు తీసుకుపోవడం తో ప్రీజర్ లో ఉంచి క్లూస్ టీమ్ కు సమాచారం అందించిన పోలీసులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story