VR Puram: తిమ్మాపురంలోనే పునరావాసం కల్పించాలి

VR Puram: అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం గుండుగూడెంలో పోలవరం ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Aug 2026 4:54 PM IST
VR Puram
X

VR Puram: తిమ్మాపురంలోనే పునరావాసం కల్పించాలి

వి ఆర్ పురం: విఆర్ పురం మండలం గుండుగూడెం గ్రామంలో పోలవరం ప్రాజెక్టు అధికారులు శుక్రవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సభలో గ్రామస్తులు తిమ్మాపురంలో పునవాసం కల్పించాలని మరియు అక్కడే భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు వలన తాము సర్వం కోల్పోతున్నామని కావున నిర్వాసితులు కోరుకున్న చోటే పునావాసం కల్పించాలని మాజీ సర్పంచ్ పిట్టా రామారావు కోరారు.తిమ్మాపురంలో భౌగోళిక అంశాలు నివాసయోగ్యంగా ఉంటుందని రామారావు అన్నారు.

ఈ కార్యక్రమంలో పీసా ఉపాధ్యక్షుడు కోటం జయరాజు,పాయం సత్యనారాయణ,సోడే రామారావు,సవలం దుర్గాప్రసాద్,ఊయిక లక్ష్మణరావు,కుంజా రామారావు,కట్టి రామారావు,మడివి బాలరాజు,సోడే విజయ్, కోటం వెంకటేష్,కొర్రి సత్యనారాయణ,సోడే వెంకమ్మ, పాయం పాపమ్మ, కోడి భూబమ్మ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story