Visweswarayapuram: ఓజోన్ పరిరక్షణపై వివేకానంద స్కూల్ విద్యార్థుల చైతన్యం!

Visweswarayapuram: కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఓజోన్ పొర పరిరక్షణపై అవగాహన సదస్సు.

PRABHU, RAZOLE
Published on: 16 Sept 2026 5:05 PM IST
Visweswarayapuram
X

Visweswarayapuram: ఓజోన్ పరిరక్షణపై వివేకానంద స్కూల్ విద్యార్థుల చైతన్యం!

విశ్వేశ్వరాయపురం: డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఓజోన్ పొర పరిరక్షణపై విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓజోన్ పొర ప్రాధాన్యత, దాని పరిరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవరాశులను రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులకు వివరించారు. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, ప్రకృతి వనరులను పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులు “SAVE OZONE”, “SAVE EARTH”, “SAVE OUR FUTURE”, “SAVE PLANET” వంటి సందేశాలతో రూపొందించిన పోస్టర్లను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే పర్యావరణంపై బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించుకోవాలని విద్యార్థులు పిలుపునిచ్చారు.

“ఓజోన్‌ను కాపాడుదాం – భూమిని రక్షిద్దాం – భవిష్యత్ తరాలను సురక్షితంగా ఉంచుదాం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన O₃ మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విద్యార్థుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఓజోన్ పొర పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని చాటిచెప్పారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విద్యార్థులు సందేశమిచ్చారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE