Lakkavaram: ఆర్‌డీ నిర్లక్ష్యంపై పోస్టుమాస్టర్‌కు నోటీసులు
Lakkavaram: లక్కవరంలో ఆర్‌డీ జమ విషయంలో పోస్టుమాస్టర్ నిర్లక్ష్యంపై బాధితుడు జిల్లెల్ల శ్రీనివాస్ వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించి రిజిస్టర్డ్ లేఖ పంపారు.
Lakkavaram: ఆర్‌డీ నిర్లక్ష్యంపై పోస్టుమాస్టర్‌కు నోటీసులు
లక్కవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) విషయంలో పోస్టుమాస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాధితుడు జిల్లెల్ల శ్రీనివాస్ తెలిపారు.
ఈ విషయంపై బాధితుడు శ్రీనివాస్ వినియోగదారుల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్, ఉపాధ్యక్షులు పలచోళ్ళ రాంబాబు, మాజీ అధ్యక్షులు రుద్రరాజు గోపాలకృష్ణ రాజు మరియు బాధితుడు జిల్లెల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్‌డీ విషయంలో గతంలోనే లక్కవరం పోస్ట్‌మాస్టర్ శ్రీ సుబ్రహ్మణ్యంతో మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
పోస్ట్‌మాస్టర్ నిర్లక్ష్య వైఖరి కారణంగా జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ లక్కవరం పోస్ట్‌మాస్టర్ శ్రీ సుబ్రహ్మణ్యానికి ఈరోజు రిజిస్టర్డ్ లేఖ పంపించినట్లు వారు తెలిపారు.
రిజిస్టర్డ్ లేఖ అందిన 15 రోజుల్లోగా సంబంధిత అధికారి స్పందించకపోతే జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేసి, బాధితుడికి జరిగిన నష్టానికి నష్టపరిహారం కోరనున్నట్లు వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని అమలాపురం ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు.




