Razole: రాజోలులో విశ్వహిందూ పరిషత్ సమావేశం నూతన కమిటీల బాధ్యతల స్వీకరణ
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు శివాలయంలో విహెచ్‌పి సమావేశం. 16 గ్రామాల నుంచి 30 కమిటీల బాధ్యతల స్వీకరణ, కండువాలు కప్పి సన్మానం.
Razole: రాజోలులో విశ్వహిందూ పరిషత్ సమావేశం: నూతన కమిటీల బాధ్యతల స్వీకరణ
Razole: రాజోలు మండలం లోని రాజోలు శివాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 16 గ్రామాలకు చెందిన 30 కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు అధ్యక్షులు, సెక్రటరీలు, భజరంగ్‌దళ్ ప్రముఖ్‌లు, సత్సంగ్ ప్రముఖ్‌లు, దుర్గావాహిని ప్రముఖ్‌లతో పాటు కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
ధర్మం, దేశం కోసం అంకితభావంతో పనిచేస్తామని కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు భాను ప్రకాష్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా హాజరై సందేశాలు ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులను అభినందించి, కండువాలు కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాజా నాగరత్నకుమార్, ప్రయోగ నరసింహమూర్తి, అడబాల నరసింహారావు, రేఖపల్లి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ రాజు, కామేశ్వరరావు, ఆచంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన కమిటీ సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.




