Sakhinetipalli: అంతర్వేది ఆలయంలో ఘనంగా వరలక్ష్మి కుంకుమ పూజలు!
Sakhinetipalli: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.
Sakhinetipalli: అంతర్వేది ఆలయంలో ఘనంగా వరలక్ష్మి కుంకుమ పూజలు!
సఖినేటిపల్లి: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలోని ప్రముఖ నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 400 మంది ముత్తైదువులు పాల్గొని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో పాల్గొన్న ముత్తైదువులకు ఎటువంటి రుసుము లేకుండా అమ్మవారి రూపు, పూజా సామగ్రిని ఆలయ అధికారులు పంపిణీ చేశారు.
పూజల అనంతరం భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాద వితరణ చేశారు. అలాగే ఆలయ నిత్యాన్నదాన విభాగంలో భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్ తెలిపారు.




