Rampachodavaram: సీఎం ప్రశంసలు పొందిన చిన్నారి శివానీ అనంత లోకాలకు..

Rampachodavaram: రంపచోడవరంలో విద్యార్థిని ముర్రం శివానీ మృతిపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి దిగ్భ్రాంతి ఇటీవల సీఎంను కలిసిన శివానీ ఉరివేసుకోవడంపై విచారణకు ఆదేశం

Prasanna, Rampachodavaram
Published on: 27 July 2026 4:34 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: సీఎం ప్రశంసలు పొందిన చిన్నారి శివానీ అనంత లోకాలకు..

ముర్రం శివానీ మృతి అత్యంత బాధాకరం

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో ఫోటో తీసుకున్న గిరిజన విద్యార్ధిని

అంతలోనే అనంత లోకాలకు కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు

చిన్నారి ఉరివేసుకున్న మృతి విషయమై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కన్నీటిపర్యం

రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

ఉరి వేసుకుని మరణించిన గిరిజన విద్యార్ధిని మృతిపై విచారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంప చోడవరంలో ఆమె స్వగృహంలో ఆదివారం రాత్రి ఉరివేసుకుని మరణించారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి రంప చోడవరం మెగా పేరెంట్ -టీచర్స్ మీటింగ్ లో భాగంగా ఆమె వాక్చాతుర్యంతో ప్రశంసలు పొందిన గిరిజన విద్యార్ధిని ముర్రం శివానీ(15సం") ఇకలేరు. ఆమె వారి స్వగృహంలో ఉరి వేసుకుని మరణించారు. ఇంతలోనే అనంతలోకాలకు వెళ్ళిన ఆమె మృతిపై తలిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మరణవార్త విన్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని వారి తల్లిదండ్రులైన వర ప్రసాద్, సౌభాగ్యవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గిరిజన విద్యార్ధిని మృతిపై ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విన్న ఆమె చలించిపోయారు. కుటుంబసభ్యుల రోదన చూసి ఆమె ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరిగా కన్నీరు మున్నీరుగా కన్నీరు కార్చారు. ఆమె భౌతిక కాయం పై పుష్ప గుచ్చం ఉంచి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సహచర విద్యార్దులు శివానీ మృతదేహం చూసి ఒక్కసారిగా చలించి కన్నీరు పెట్టుకున్నారు. ఇంతవరకు మనతో ఉన్న విద్యార్ధిని ఇకలేరు అనే మరణ వార్త తెలుసుకున్న తోటి విద్యార్దులు శోఖానికి అవధులు లేకుండా దుఃఖించారు.

కార్యక్రమంలో ఆమె వెంట రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా బాపన్న దొర అనే బాబీ, కడబాల గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story