Adurru: ఆదుర్రులో అలరించిన సాంప్రదాయ మల్ల కంభం క్రీడ!

Adurru: మామిడికుదురు మండలం ఆదుర్రు రామాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయ మల్ల కంభం క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి.

PRABHU, RAZOLE
Published on: 14 Sept 2026 8:36 PM IST
Adurru
X

Adurru: ఆదుర్రులో అలరించిన సాంప్రదాయ మల్ల కంభం క్రీడ!

ఆదుర్రు: మామిడికుదురు మండలం ఆదుర్రు రామాలయం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం సాంప్రదాయ మల్ల కంభం క్రీడను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎత్తైన స్తంభాన్ని ఎక్కేందుకు యువకులు ఎంతో ఉత్సాహంతో పోటీ పడ్డారు.

ఒకరిపై ఒకరు నిలబడుతూ, పరస్పర సహకారంతో స్తంభాన్ని అధిరోహించి పైన ఏర్పాటు చేసిన బహుమతిని అందుకునేందుకు యువత చేసిన ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి. యువకుల పోటాపోటీ ప్రదర్శన, వారి సమన్వయం, ధైర్యసాహసాలు అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, భక్తులను విశేషంగా అలరించాయి.

మల్ల కంభం క్రీడను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. యువత ఉత్సాహంతో క్రీడను నిర్వహించడంతో రామాలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ క్రీడను కొనసాగించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE