Sakhinetipalli: సఖినేటిపల్లిలో జనసైనికుల ఆగ్రహం.. కఠిన చర్యలకు డిమాండ్
Sakhinetipalli: సఖినేటిపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను శిలాఫలకంపై నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం తీవ్ర కలకలం రేపింది.
Sakhinetipalli: సఖినేటిపల్లిలో జనసైనికుల ఆగ్రహం.. కఠిన చర్యలకు డిమాండ్
సఖినేటిపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామంలో మార్కెట్ యార్డు వద్ద రూ.1.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారుల పనుల కోసం 2025 అక్టోబర్ 1న ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల చిత్రాలను ఉద్దేశపూర్వకంగా తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల ఫణి కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, జనసైనికులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.




