Mummidivaram: చిర్రయానాం తీరంలో క్షుద్రపూజల కలకలం.. ఆరుగురిని పట్టిన స్థానికులు!

Mummidivaram: కాట్రేనికోన మండలం చిర్రయానాం సముద్రతీరంలో పూజా సామాగ్రితో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Aug 2026 6:07 PM IST
Mummidivaram
X

Mummidivaram: చిర్రయానాం తీరంలో క్షుద్రపూజల కలకలం.. ఆరుగురిని పట్టిన స్థానికులు!

Mummidivaram: సముద్రతీరంలోని దట్టమైన పొదల్లో రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికులు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తులతో పాటు ఓ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సంఘటనా స్థలంలో పూజా సామాగ్రి కనిపించడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, అక్కడికి మరికొంతమంది వ్యక్తులు తమ వెంట ఓ బాలికను కూడా తీసుకువచ్చినట్లు, గ్రామస్థులు రావడంతో బాలికను తీసుకుని పరారైనట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ లభించిన పూజా సామాగ్రి నేపథ్యంలో ఇది క్షుద్రపూజలకు సంబంధించిన ఘటననా, లేక మరేదైనా కారణంతో వారు అక్కడికి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తులు అక్కడికి ఎందుకు వచ్చారు, బాలికను ఎందుకు తీసుకువచ్చారనే అంశాలతో పాటు సంఘటనా స్థలంలో లభించిన పూజా సామాగ్రిపై పోలీసులు విచారణ చేపట్టాలని స్దానికులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story