Kadiyam: పేద విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయురాలు రూ.30 వేల సాయం!

Kadiyam: కడియం ఉపాధ్యాయురాలు అనిత ఉదారత. చేయూత చిల్డ్రన్ హోమ్ పేద విద్యార్థుల చదువు కోసం రూ.30 వేల ఆర్థిక సాయం, ఇద్దరు పిల్లల దత్తత.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 13 Sept 2026 12:32 PM IST
Kadiyam
X

Kadiyam: పేద విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయురాలు రూ.30 వేల సాయం!

Kadiyam: కడియం మండలం, కడియపులంక పంచాయతీ పరిధిలోని వెంకాయమ్మ పేట ఎంపీపీ ఎంపీఎస్ ప్రాథమిక పాఠశాల లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ సాక అనిత "చేయూత చిల్డ్రన్ హోమ్" పిల్లల చదువుకు భరోసాగా 30 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. చేయూత చారిటబుల్ ట్రస్ట్ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థుల చదువు నిమిత్తం ఈ సహాయం అందించినట్లు ఆమె తెలిపారు. ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకొని వారికి విద్యాదానం పేరుతో ఆర్థిక సహాయాన్ని అందించారు.

చేయూత ఫౌండేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలుగా ఉంటూ, తుఫాను బాధితులకు అండగా నిలవడం, వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం, కరోనా విపత్కర పరిస్థితులలో కరోనా సోకిన వారికి మందులు, ఆహారం పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, 2026 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జెడి నాగమణి, చేయూత ఫౌండర్ రవి తదితరులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL