Amalapuram: గుండె శస్త్రచికిత్స బాధితుడికి గొలకోటి చిన్న ఆర్థిక సాయం!
Amalapuram: అమలాపురంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న నిరుపేద బాధితుడికి ఆర్థిక సాయం అందించి ఆదుకున్న తెలుగు యువత అధ్యక్షుడు గొలకోటి చిన్న.
Amalapuram: గుండె శస్త్రచికిత్స బాధితుడికి గొలకోటి చిన్న ఆర్థిక సాయం!
Amalapuram: అమలాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గొలకోటి చిన్న మరోసారి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఇటీవల కాలంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న చల్లపల్లి అంబేద్కర్ నగర్‌కు చెందిన రొక్కాల రామస్వామి వారిని చిన్న పరామర్శించి,అతని ప్రస్తుతం ఆరోగ్యం పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ నీరుపేద కుటుంబానికి కొండంత అండగా ఉంటాను అని చెప్పి ప్రస్తుతం 5,000/- రూపాయలు నగదును ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కష్టకాలంలో ఆపన్నహస్తం అందించి ఆదుకున్న మా ప్రియతమ నేత గొలకోటి చిన్న కి చల్లపల్లి అంబేద్కర్ నగర్ గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలియజేసిన కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు గోలకోటి చిన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




