Razole: పొదలాడలో ఘనంగా తెదేపా నేత గొల్లపల్లి అమూల్య జన్మదిన వేడుకలు
Razole: కోనసీమ జిల్లా పొదలాడలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు
Razole: పొదలాడలో ఘనంగా తెదేపా నేత గొల్లపల్లి అమూల్య జన్మదిన వేడుకలు
పొదలాడలో ఘనంగా తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య జన్మదిన వేడుకలు
రాజోలు : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం పొదలాడ గ్రామంలోని శుభం గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, రాష్ట్ర రోడ్ల డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, పార్టీ ముఖ్య నాయకులు బోళ్ల సతీష్, జగడం సత్యనారాయణ, బోళ్ల వెంకట రమణ మరియు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమూల్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరుకావడంతో వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నిర్వాహకులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.




