Razole: కూటమి ప్రభుత్వం హామీల నిలబెట్టుకుంది: టీడీపీ నేత అమూల్య!

Razole: కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య మీడియా సమావేశం నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 23 July 2026 4:39 PM IST
Razole
X

Razole: కూటమి ప్రభుత్వం హామీల నిలబెట్టుకుంది: టీడీపీ నేత అమూల్య!

రాజోలు: ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా,రాజోలు మండలం, తాటిపాకలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండో ఏడాది కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా విద్యా రంగం, తల్లిదండ్రుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధత మరోసారి స్పష్టమైందన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ కావడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఊరట లభిస్తోందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం క్రమబద్ధంగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అమూల్య చెప్పారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story