Razole: స్థానిక ఎన్నికల్లో కూటమి సమన్వయంతో ముందుకెళ్లాలి!

Razole: రాజోలు శివకోటిలో 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని గొల్లపల్లి అమూల్య పిలుపు.

PRABHU, RAZOLE
Published on: 11 Sept 2026 2:13 PM IST
Razole
X

Razole: స్థానిక ఎన్నికల్లో కూటమి సమన్వయంతో ముందుకెళ్లాలి!

Razole: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయబావుటా ఎగురవేయాలని రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్‌ గొల్లపల్లి అమూల్య పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం శివకోటి లోని టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం 45వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల మృతిచెందిన పార్టీ కుటుంబ సభ్యుల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అమూల్య మాట్లాడుతూ పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో దరఖాస్తుదారులకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. టీడీపీ నిర్వహిస్తున్న డోర్‌ టు డోర్‌ కార్యక్రమం దాదాపు పూర్తయిందని, మిగిలిన బూత్‌లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం వివిధ సమస్యలపై మూడు అర్జీలు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు నాలుగు అర్జీలను అమూల్య స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE