Razole: సోంపల్లిలో టీడీపీ డోర్ టు డోర్ ప్రచారం పాల్గొన్న గొల్లపల్లి అమూల్య
Razole: రాజోలు నియోజకవర్గం సోంపల్లిలో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ డోర్ టు డోర్ ప్రచారం. పాల్గొన్న టీడీపీ అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య.
Razole: సోంపల్లిలో టీడీపీ డోర్ టు డోర్ ప్రచారం పాల్గొన్న గొల్లపల్లి అమూల్య
Razole: రాజోలు నియోజకవర్గంలోని సోంపల్లి గ్రామంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె పలు ఇళ్లను సందర్శించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీపై ప్రజలు చూపుతున్న ఆదరణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ (సాయిబాబు రాజు), రాజోలు మండల పార్టీ అధ్యక్షుడు అనుచూరి పురుషోత్తం, వైస్ ఎంపీపీ పొలమూరు శ్యాంబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు లంకే శ్రీనివాసరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గాడి పాపయ్యతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




