Tantikonda: చంద్రబాబు అక్రమ అరెస్టే వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణం!
Tantikonda: చంద్రబాబును 53 రోజులు అక్రమంగా నిర్బంధించడమే వైఎస్సార్‌సీపీ పతనానికి నాంది పలికిందని రాజానగరం నియోజకవర్గ తంటికొండ టీడీపీ అధ్యక్షుడు నాగం వెంకటపతి వ్యాఖ్య.
Tantikonda: చంద్రబాబు అక్రమ అరెస్టే వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణం!
Tantikonda: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించడం వైసీపీ ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనమని తంటికొండ టీడీపీ అధ్యక్షుడు నాగం వెంకటపతి అన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన రోజు వైసీపీకి చీకటి రోజుగా మిగిలిపోయిందని, అదే రోజు ఆ పార్టీ ఓటమికి నాంది పలికిందనిఆయనవ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు ప్రజలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ స్పందించి నిరసనలు తెలిపారని గుర్తుచేశారు.
చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని ప్రజలు బలంగా విశ్వసించారని, ఆయన అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా ప్రజలు భావించారని నాగం వెంకటపతి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ అధినేతకు అండగా నిలిచారని తెలిపారు.
ప్రజల తీర్పు ద్వారా వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన ఫలితం, గత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వైసీపీ నాయకుల అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఎన్నికల సమయంలో గుర్తుచేసుకుని తమ ఓటు ద్వారా సమాధానం చెప్పారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా భాగం వెంకటపతి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగావ్యవహరించారనివిమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన ఏ రాజకీయపార్టీఅయినాఅధికారానికి దూరం కావాల్సిందేనని అన్నారు.వైసీపీ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుని కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని, ప్రజల తీర్పుతో వైసీపీ ప్రభుత్వానికి ముగింపు పలికి కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగం వెంకటపతి, గెడ్డం బాబు, బదిరెడ్డి రవి, చింతల నాగు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.




