Sakhinetipalli: పిల్లల ఆరోగ్య రక్షణకే ఉచిత టీకాలు పిహెచ్‌సి వైద్యాధికారి

Sakhinetipalli: సఖినేటిపల్లి పిహెచ్‌సి ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుండి 8 వరకు పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

PRABHU, RAZOLE
Published on: 6 Aug 2026 4:59 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: పిల్లల ఆరోగ్య రక్షణకే ఉచిత టీకాలు పిహెచ్‌సి వైద్యాధికారి

సఖినేటిపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ దుర్గా కావ్య తెలిపారు. 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లలకు డీపీటీ (2వ బూస్టర్), 10 సంవత్సరాల వారికి టీడీ (Td-10), 16 సంవత్సరాల వారికి టీడీ (Td-16) టీకాలు వేస్తారని చెప్పారు.

డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటానస్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించారు. సచివాలయ ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాఠశాలలను సందర్శించి అర్హులైన విద్యార్థులకు టీకాలు వేస్తారని తెలిపారు. బడికి వెళ్లని పిల్లలు సమీప ఆరోగ్య కేంద్రాల్లో టీకా పొందాలని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించి అర్హులైన ప్రతి విద్యార్థికి టీకాలు వేయించాలని డాక్టర్ దుర్గా కావ్య విజ్ఞప్తి చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story