Shakambari: శాకాంబరి అవతారంలో ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారు!
Shakambari: ద్రాక్షారామంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు సారె సమర్పించారు.
Shakambari: శాకాంబరి అవతారంలో ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారు!
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ
శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీమాణిక్యంబ అమ్మవారు
అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీభీమేష్వర స్వామి ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఈరోజు శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చారు
ఈరోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి కావడం విశేషం ఈ సందర్భంగా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని పూజించి ఆరాధించడం వస్తున్న ఆచారం ఈరోజు వేద వ్యాసుని జన్మ దినోత్సవం కావడం విశేషం ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులచే వారి ఆడపడుచుగా సారి సమర్పణ జరుగుట ఇక్కడ ఆచారం ఉదయాన్నే ఆరు గంటలకి అమ్మవారి పుట్టింటి నుండి సారి తీసుకువచ్చి ఇక్కడ సమర్పించారు
విశేషమైన శాకాంబరి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం భక్తులకు కనులవిందుగా అమ్మవారి యొక్క రూపం దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు.




