Chintur: పొంగిపొర్లుతున్న వాగులు భయం గుప్పెట్లో లోతట్టు వాసులు!

Chintur: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 31 July 2026 11:16 AM IST
Chintur
X

Chintur: పొంగిపొర్లుతున్న వాగులు భయం గుప్పెట్లో లోతట్టు వాసులు!

చింతూరు: పోలవరంజిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వలన శబరి నదిలో వరద నీరు అధికంగా చేరి నీటిమట్టం క్రమేపి పెరుగుతూ పరవళ్ళు తొక్కుతుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని తాలిపేరు ప్రాజెక్టులో వరద నీరు భారీగా రావడంతో ప్రాజెక్టు 24 గేట్లలో 11 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 37.60 అడుగులకు చేరుకొని ప్రవహిస్తుంది.

చింతూరు ఏజెన్సీలోని శబరి నదిలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో ఉప్పొంగి ప్రవహిస్తుంది. శబరి నదికి అనుసంధానమైన కుయుగూరు, చీకటి,సోకిలేరు,చంద్రవంక వాగులు పొంగిపొర్లుతున్నాయి. శబరి ఉదృతి పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో భయం అలముకుంది. ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవం సంభవిస్తుందో అని భయం గుప్పెట్లో జీవనం కొనసాగిస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story