Antarvedi: అంతర్వేది లైట్ హౌస్ వద్ద ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం!

Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లైట్ హౌస్ వద్ద సముద్రం 100 మీటర్ల మేర ముందుకు వచ్చింది.

PRABHU, RAZOLE
Published on: 29 July 2026 1:38 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది లైట్ హౌస్ వద్ద ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం!

Antarvedi: డాక్టర్. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది లైట్ హౌస్ ప్రాంతంలో సముద్రం దాదాపు 100 మీటర్ల మేర ముందుకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. గత రెండు రోజులుగా సముద్రం అసాధారణంగా ముందుకు రావడంతో లైట్ హౌస్ వెనుక భాగంలో ఉన్న సరుగుడు తోటలు, తీర ప్రాంతం కోతకు గురవుతున్నాయని పేర్కొన్నారు.

సముద్ర తీరం కోత తీవ్రత పెరగడంతో తీర ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం మరింత ముందుకు వస్తే భూములు, తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తీర ప్రాంత పరిరక్షణ చర్యలు చేపట్టాలని, సముద్ర కోతను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story