Visweswarayapuram: వివేకానంద పాఠశాలలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ!

Visweswarayapuram: విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విద్యార్థులు జాతీయ జెండాలతో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 14 Aug 2026 1:51 PM IST
Visweswarayapuram
X

Visweswarayapuram: వివేకానంద పాఠశాలలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ!

Visweswarayapuram: దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను విద్యార్థుల్లో పెంపొందించే ఉద్దేశంతో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, విశ్వేశ్వరాయపురం లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. క్రమశిక్షణతో మార్చ్‌పాస్ట్‌లో పాల్గొని జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని చాటారు. జాతీయ జెండా ప్రాముఖ్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశ సమైక్యత, పౌర బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ బి. ఫణిలక్ష్మి, పాఠశాల సలహాదారు రమేష్ బాబు, స్కూల్ మెంబర్ సూర్యనారాయణ, విద్యార్థి సంఘ నాయకుడు తాడి సహదేవ్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశభక్తి భావనను మరింత బలపరచాలని, విద్యార్థులు దేశ అభివృద్ధిలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ గౌరవం వంటి విలువలను పెంపొందించింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story