Samarlakota: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రాజభాష హిందీ సమావేశం

Samarlakota: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ఘనంగా రాజభాష హిందీ సమావేశం. హిందీని విధిగా ఉపయోగించాలని కోరిన ప్రధాన రాజభాష అధికారి హేమంత్ వాడేకర్.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 5 Aug 2026 9:01 PM IST
Samarlakota
X

Samarlakota: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రాజభాష హిందీ సమావేశం

సామర్లకోట: సామర్లకోట రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ మేనేజర్ M.రమేష్ ఆధ్వర్యంలో రాజ భాష (హిందీ) సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి విజయవాడ నుండి ప్రధాన రాజ భాష అధికారి శ్రీ హేమంత్ వాడేకర్ పాల్గొన్నారు.

ఈ సమావేశం లో మాతృభాషతో పాటు హిందీ ని కూడా ఉపయోగించాలని,హిందీ లో మాట్లాడటం ,అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు రాజ భాషను కూడా ఉపయోగించాలని తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ రాజ భాషకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ సమావేశం లో కోరారు. ఈ కార్యక్రమానికి హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి , సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (వర్క్స్) రత్నాకర్ చందు, డిప్యూటీ సిటీఐ చైతన్య , RPF CI మధు, చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ ప్రకాష్,చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ రాజు, చీఫ్ గూడ్స్ సూపర్వైజర్ దుర్గారావు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (టెలికామ్) రామక్రిష్ణ, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (OHE) మోహన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story