Razole: వైఎస్సార్ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన రాజేశ్వరి దేవి!
Razole: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రాజోలులో వైఎస్సార్ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి.
Razole: వైఎస్సార్ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన రాజేశ్వరి దేవి!
Razole: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17 వ వర్ధంతిని పురస్కరించుకుని రాజోలులో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని వైఎస్సార్ నిలువెత్తు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, రాజోలు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ,108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.
వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




