Razole: రాజోలులో ధ్వంసమైన వైఎస్సార్సీపీ జెండా దిమ్మ!

Razole: రాజోలులో వైఎస్సార్సీపీ జెండా దిమ్మను వాహనం ఢీకొట్టి ధ్వంసం చేయడంతో, నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PRABHU, RAZOLE
Published on: 4 Sept 2026 10:05 AM IST
Razole
X

Razole: రాజోలులో ధ్వంసమైన వైఎస్సార్సీపీ జెండా దిమ్మ!

Razole: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లోని రాజోలు మార్కెట్ సమీపంలో ఉన్న వైకాపా పార్టీ జెండా దిమ్మను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైనట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.

అలాగే, జెండా దిమ్మ వెనుక ఉన్న స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కింద ఉన్న సిమెంట్ దిమ్మకు అమర్చిన టైల్స్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై వైకాపా రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాజోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story