Razole: తాళం వేసిన ఇంట్లో దొంగల హల్చల్ రాజోలులో కేసు నమోదు!
Razole: రాజోలు మండలం పాలగుమ్మిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. నగదు, పాత్రలు చోరీ కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Razole: తాళం వేసిన ఇంట్లో దొంగల హల్చల్ రాజోలులో కేసు నమోదు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం లోని పాలగుమ్మి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన మట్టా నాగేశ్వరరావు ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
బాధితుడు ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తుండటంతో పాలగుమ్మిలోని తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. మంగళవారం స్వగ్రామానికి వచ్చి ఇంటిని పరిశీలించగా, ఇంటి వెనుక వైపు తలుపుల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా కొంత నగదుతో పాటు స్టీలు, ఇత్తడి పాత్రలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
దీంతో బాధితుడు మంగళవారం రాత్రి రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బుధవారం రాజోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి చోరీకి పాల్పడిన దుండగుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.




