Razole: తాటిపాకలో టన్నున్నర పీడీఎస్ బియ్యం పట్టివేత వాహనం సీజ్!
Razole: రాజోలు మండలం తాటిపాకలో టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టన్నున్నర పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు. ఒకరిపై కేసు నమోదు.
Razole: తాటిపాకలో టన్నున్నర పీడీఎస్ బియ్యం పట్టివేత వాహనం సీజ్!
Razole: రాజోలు మండలం తాటిపాకలో అక్రమంగా తరలిస్తున్న సుమారు టన్నున్నర పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పొదలాడ నుంచి టాటా ఏస్ వాహనంలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో తాటిపాకలో వాహనాన్ని తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పట్టుబడిన బియ్యం మలికిపల్లి గ్రామానికి చెందిన అడబాల సూర్యనారాయణ @ అబ్బు కు సంబంధించినవిగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటనపై సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, బియ్యం తరలిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేసినట్లు సమాచారం.
Next Story




