Razole: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత రాజోలు ఎస్సై మల్లికార్జున రెడ్డి!

Razole: రాజోలులో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసిన ఎస్సై మల్లికార్జున రెడ్డి. డీజే శబ్ద కాలుష్యాన్ని నివారించాలని, నిబంధనలు పాటించాలని సూచన.

PRABHU, RAZOLE
Published on: 13 Sept 2026 3:43 PM IST
Razole
X

Razole: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత రాజోలు ఎస్సై మల్లికార్జున రెడ్డి!

Razole: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాజోలు సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మల్లికార్జున రెడ్డి సూచించారు. సోంపల్లి లక్ష్మీదేవి ఫైనాన్స్ ప్రొప్రైటర్ కొప్పిశెట్టి నాగ వెంకట దుర్గ బాబు ఆధ్వర్యంలో సమకూర్చిన మట్టి వినాయకుల ప్రతిమలను రాజోలు ఎస్సై చేతుల మీదుగా భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడవచ్చన్నారు. వినాయక చవితి వేడుకల్లో డీజే సౌండ్‌తో శబ్ద కాలుష్యానికి కారణం కాకుండా, నిబంధనలను పాటించాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు తీసుకోవాలని తెలిపారు.

మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం అందిస్తున్న కొప్పిశెట్టి నాగ వెంకట దుర్గ బాబును ఎస్సై అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎం అయ్యాజీ వేమా, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గణపతి ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు అడబాల సూర్యప్రకాశరావు (నాని), విశ్వహిందూ పరిషత్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం, దార్ల పెద్దబాబు, నామన షణ్ముఖేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE