Razole: గొంది గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ క్షేత్రస్థాయి పర్యటన

Razole: సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటించారు.

PRABHU, RAZOLE
Published on: 22 Jun 2026 8:13 PM IST
Razole
X

Razole: గొంది గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ క్షేత్రస్థాయి పర్యటన

Razole: డాక్టర్. బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటించి, స్లడ్జ్‌తో నిండిపోయిన నొవ్వ డ్రెయిన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామస్థులు, సంబంధిత అధికారులతో సమావేశమై గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు నొవ్వ డ్రెయిన్ పూడికతీత చేపట్టి గట్లు బలోపేతం చేయాలని, గొంది (నేరెళ్ల) డ్రెయిన్ అభివృద్ధి పనులు చేపట్టాలని, స్లూయిజ్ మరమ్మతులు నిర్వహించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గొంది–అంతర్వేది దేవస్థానాన్ని అనుసంధానించే పట్టెల వంతెన, గొంది–బ్రహ్మంగారి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే రైతులు, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, నొవ్వ డ్రెయిన్ పూడికతీత, గట్లు బలోపేతం, గొంది (నేరెళ్ల) డ్రెయిన్ అభివృద్ధి, స్లూయిజ్ మరమ్మతులు, పట్టెల వంతెన మరియు గొంది–బ్రహ్మంగారి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దశలవారీగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏర్పడిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం గొంది పుష్కరాల రేవును సందర్శించిన ఎమ్మెల్యే, రాబోయే పుష్కరాల నాటికి రేవు అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story