Malikipuram: కేశనపల్లి పంటకాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Malikipuram: కేశనపల్లి పంటకాలువ పనులను పరిశీలించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. రైతుల భాగస్వామ్యంతో 4 కిలోమీటర్ల కాలువ తవ్వకం అభినందనీయమని వెల్లడి.
Malikipuram: కేశనపల్లి పంటకాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Malikipuram: కేశనపల్లి పంటకాలువ పథకంలో భాగంగా పడమటిపాలెం, నీటికన్నం వద్ద రైతులు స్వచ్ఛందంగా చేపట్టిన కాలువ పనులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై కాలువ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై చర్చించారు.
కేశనపల్లి పంటకాలువ పథకంలో భాగంగా మొత్తం 20 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించాల్సి ఉండగా, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాలుగు కిలోమీటర్ల మేర కాలువ తవ్వేందుకు సిద్ధపడటం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
గూడపల్లి–2 బ్రాంచ్ కెనాల్ నుంచి కేశనపల్లి వరకు, పరిసర ప్రాంతాల్లోని మరో ఐదు గ్రామాలకు సాగునీరు అందించే ఈ పథకం పూర్తయితే సుమారు 5,500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని తెలిపారు.
రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయించి, ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని దేవ వరప్రసాద్ హామీ ఇచ్చారు.
కాలువ నిర్మాణం పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఈ ప్రాంత వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో రైతులు, సంబంధిత అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.




