Lakkavaram: రాజముద్రతో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

Lakkavaram: లక్కవరంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.

PRABHU, RAZOLE
Published on: 7 Sept 2026 4:47 PM IST
Lakkavaram
X

Lakkavaram: రాజముద్రతో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

లక్కవరం : రీ-సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రైతులకు పంపిణీ చేశారు. మలికిపురం మండలం లక్కవరం ఎం.జి. గార్డెన్స్‌లో లక్కవరం, బట్టేలంక, ఇరుసుమండ గ్రామాలకు చెందిన రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రీ-సర్వే ద్వారా భూ రికార్డులను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించి రైతులకు స్పష్టమైన భూ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులు, హక్కులకు సంబంధించిన సందిగ్ధతలు తొలగే అవకాశం ఉందన్నారు.

రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల భూ యాజమాన్యానికి ముఖ్యమైన ధ్రువపత్రాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. వీటి ద్వారా భూ వివాదాలను తగ్గించడంతో పాటు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సేవలను రైతులు సులభంగా పొందవచ్చన్నారు.

రైతులకు ఉన్న భూ సమస్యలను అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story