Malikipuram: మలికిపురంలో ఎన్డీఏ రెండేళ్ల విజయోత్సవ సభ

Malikipuram: మలికిపురంలో ఎన్డీఏ కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ ఘనంగా జరిగింది.

PRABHU, RAZOLE
Published on: 19 Jun 2026 12:07 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో ఎన్డీఏ రెండేళ్ల విజయోత్సవ సభ

మలికిపురం: మలికిపురంలోని ఎల్‌.ఎస్‌. ల్యాండ్‌మార్క్‌లో శుక్రవారం ఎన్డీఏ కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి - తెదేపా ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యోజీ వేమతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో రాజోలు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రోడ్ల అభివృద్ధి, అమరజీవి జలధార తాగునీటి పథకం, విద్యుత్ రంగంలో కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటు, శంకరగుప్తం డ్రెయిన్ ఆధునీకరణ, కేశవదాసుపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ, అవుట్‌ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణం, అంతర్వేది అభివృద్ధి, ఆధ్యాత్మిక క్షేత్రాల పునరుద్ధరణ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు.

అలాగే పెన్షన్ పథకం, తల్లికి వందనం, రైతు భరోసా, మత్స్యకార భరోసా, సీఎం రిలీఫ్ ఫండ్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని పేర్కొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి శతశాతం విజయాలు సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా అమలు చేస్తూ రాజోలు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story