Sakinetipalli: అప్పనరామునిలంకలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే!

Sakinetipalli: సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో వరద ప్రాంతాలను పరిశీలించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశం.

PRABHU, RAZOLE
Published on: 3 Aug 2026 4:05 PM IST
Sakinetipalli
X

Sakinetipalli: అప్పనరామునిలంకలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే!

సఖినేటిపల్లి: సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంబంధిత ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు.

వరద బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకుని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టి, అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story