Razole: రాజోలులో ఘనంగా మొక్కలు నాటే మహా యజ్ఞం: పాల్గొన్న ఎమ్మెల్యే

Razole: కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లిలో లక్ష ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.

PRABHU, RAZOLE
Published on: 25 July 2026 3:00 PM IST
Razole
X

Razole: రాజోలులో ఘనంగా మొక్కలు నాటే మహా యజ్ఞం: పాల్గొన్న ఎమ్మెల్యే

రాజోలు: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న లక్ష ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఈరోజు రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజోలు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మూడు మండలాల ఏపీఓలు, ఈసీలు, జేఈలు తదితరులు హాజరై మొక్కలు నాటారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story